Share News

దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:58 PM

దేవరకొండ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విచారణ చేపట్టి పరిష్కరించాలని దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి తహసీల్దార్లకు సూచించారు.

  దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలి

దేవరకొండ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విచారణ చేపట్టి పరిష్కరించాలని దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి తహసీల్దార్లకు సూచించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బుఽధవారం డివిజన్‌లోని అన్నిమండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. భూభారతి దరఖాస్తుల వివరాలు, రేషన్‌కార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. భూసమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం, భూసేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:58 PM