ఎస్‌ఆర్‌టీఆర్‌ఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:42 AM
యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లి మండల పరిధిలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ)లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో తెలంగాణ గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, హాస్టల్ వసతితోపాటు ఉద్యోగం కల్పించనున్నట్లు సంస్థ చైర్మన డాక్టర్ ఎన.కిషోర్‌రెడ్డి తెలిపారు.
భూదానపోచంపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లి మండల పరిధిలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ)లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో తెలంగాణ గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, హాస్టల్ వసతితోపాటు ఉద్యోగం కల్పించనున్నట్లు సంస్థ చైర్మన డాక్టర్ ఎన.కిషోర్‌రెడ్డి తెలిపారు. సంస్థలోని ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన సోమవారం తెలిపారు. రెండు నెలల కాలపరిమితి గల బేసిక్ కంప్యూటర్స్ కోర్సుకు ఇంటర్మీడియేట్ పాస్, మూడున్నర నెలల కాలపరిమితి గల ఆటోమొబైల్ -2 వీలర్ సర్వీసింగ్ కోర్సుకు పదవ తరగతి పాస్, మూడున్నర నెలల కాలపరిమితి గల సోలార్ సిస్టమ్ ఇనస్టలేషన మరియు సర్వీస్ కోర్సుకు పదవ తరగతి పాస్ లేదా ఐటీఐ ఉన్న వారికి ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 18-30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై ఉండాలన్నారు. గ్రామీణ అభ్యర్థులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు అని తెలిపారు. అర్హతల ఒరిజినల్ సర్టిపికేట్లు, జీరాక్స్ సెట్, 2 పాస్‌పోర్టుసైజు ఫొటోలు, ఆధార్‌కార్డు, రేషన కార్డుతో దరఖాస్తులు కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఇతర వివరాలకు 9133908000, 9133908111, 9133908222 లేదా 9948466111 ఫోనలో సంప్రదించాలని సంస్థ చైర్మన డాక్టర్ ఎన కిషోర్‌రెడ్డి కోరారు.