ప్రతీ ఇంటికీ ‘అమృత’ జలాలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:58 AM
చౌటుప్పల్ మునిసిపాలిటీలోని ప్రతీ ఇంటికీ కృష్ణాజలాలు అందనున్నాయి.
చురుగ్గా ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం
ఆరు మాసాల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక
చౌటుప్పల్ టౌన, ఆగస్టు 14 ( ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ మునిసిపాలిటీలోని ప్రతీ ఇంటికీ కృష్ణాజలాలు అందనున్నాయి. రూ. 21-00 కోట్ల అంచనాతో అమృత 2.0 పథకం పనులు కొనసాగుతున్నాయి. ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు కృష్ణా జలాలను అందించాలన్న లక్ష్యంతో ప్రజారోగ్య శాఖ అధికారులు పనులను వేగవంతం చేశారు. ఈ పథకం క్రింద మూడు ఓహెచఎ్‌స ట్యాంకుల నిర్మాణం జరుగుతుండగా, స్థల సమస్యతో ఒక ట్యాంక్ నిర్మాణ పనులు నిలిచి పోయాయి. ప్రజారోగ్య శాఖ డీఈఈ మనోహర వారానికి రెండు, మూడు సార్లు ఈ పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తూ వేగవంతం చేస్తున్నారు. మిషన భగీరథ పథకం ద్వారా వచ్చే కృష్ణా జలాలను ఈ ట్యాంకుల్లోకి పంపించి, ఈ ట్యాంకుల నుంచి ఏర్పాటు చేసే ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా ప్రజలకు తాగు నీటిని అందించనున్నారు. మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖల క్రింద కృష్ణా జలాలను ఇంటింటికి అందించాలన్న లక్ష్యంతో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత 2.0 పథకం పనులను ప్రజారోగ్య శాఖ కు అప్పగించారు. ఈ పథకం పనులకు 2024 ఆగస్టు 5న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాల కాల పరిమితిలో పనులను పూర్తి చేయవలసి ఉండగా, ఇప్పటికే ఒక సంవత్సరం గడిచి పోయింది. కొన్ని సాంకేతిక సమస్యలతో ట్యాంకుల నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా మొదలు పెట్టవలసి వచ్చింది. మొద టి దశలో ట్యాంకుల నిర్మాణ పనులను చేపట్టారు. చౌటుప్పల్ పట్టణంలోని 10వ వార్డు (శివాజీ నగర్) , మునిసిపల్ పరిధిలోని 6వ వార్డు (తంగడపల్లి ), 13 వ వార్డు (జయభూమి వెంచర్) , 8 వ వార్డు (లక్కారం ) లలో ఈ పథకం క్రింద నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను చేపట్టారు. ఇందులో భూ సమస్య కారణంగా లక్కారం లోని ట్యాంక్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
ట్యాంకుల సామర్థ్యం..వ్యయం
చౌటుప్పల్ పట్టణంలోని జయభూమి వెంచర్, మునిసిపాలిటీలోని తంగడపల్లిలలో ఒక్కొక్కటి 7 లక్షల లీటర్ల సామర్థంగల రెండు ఓహెచఎ్‌సఆర్ ట్యాంకులు, చౌటుప్పల్‌లోని శివాజీనగర్, లక్కారం లలో ఒక్కొక్కటి 5 లక్షల లీటర్ల సామర్థం గల రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. 7 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ ఒక్క ట్యాంకుకు రూ. 1.50 కోట్లు, 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ ఒక్కంటికి రూ.1.20 కోట్ల ను వెచ్చించి నిర్మిస్తున్నారు. నాలుగు ట్యాంక్‌ల నిర్మాణానికి రూ. 5.40 కోట్ల వ్యయం జరగనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో..
కృష్ణా జలాల సరఫరా ను మెరుగు పరిచేందుకు అమృత 2.0 పథకం కింద నిర్మాణ పనులను కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.9.66 కోట్లు (46శాతం), రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6.93కోట్లు(33 శాతం), స్టేట్ పైనాన్స కార్పొరేషన వాటా రూ.2.94 కోట్లు (14 శాతం), మునిసిపాలిటీ వాటా రూ.1.47కోట్లు (7శాతం)గా విభజించారు. ఈ నిష్ప త్తి ప్రకారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేస్తున్నాయి.
పై్‌ప్‌లైన్ల ఏర్పాటుపై సర్వే పూర్తి
నాలుగు ట్యాంకుల నుంచి కృష్ణా జలాలను ప్రజలకు అందించేందుకు చేపట్టిన పైప్‌లైన ఏర్పాటు సర్వే పనులు దాదాపుగా పూర్తయినట్టు అధికారులు తెలిపారు. పైప్‌లైన్లు పూర్తిగా లేని ప్రాంతాలతో పాటు గతంలో వేసిన పైప్‌ల సైజు తక్కువగా ఉన్న వాటిని తొలగించి కొత్తగా పైప్ లైన లను ఏర్పాటు చేయనున్నారు. కేఎనఆర్‌సీ కన్సల్టేన్సీ ఆధ్వర్యంలో పైప్ లైన ఏర్పాటు సర్వే పనులను చేపట్టారు. సుమారు 30 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన ఏర్పాటు చేయవలసి ఉంటుందని ప్రాథమిక అంచనా.
తాళ్లసింగారం వాసుల ఆగ్రహం
మునిసిపాలిటీలోని తాళ్లసింగారంలో నిర్మించవలసిన ఓహెచఎ్‌సఆర్ ట్యాంకును రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జయభూమి వెంచర్‌లోకి మార్చడం పట్ల ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మునిసిపాలిటీకి చెందిన అప్పటి ప్రజా ప్రతినిధులు సాగించిన లాలూచీ వ్యవహారంతోనే ట్యాంకు నిర్మాణాన్ని తాళ్ల సింగారం నుంచి జయభూమి వెంచర్‌లోకి మార్పిడి చేశారన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి.
కృష్ణా జలాలు ఎక్కడినుంచి వస్తాయంటే..
నాంపల్లి మండలం ఎస్. లింగోటంలోని కృష్ణా జలాల శుద్ది కేంద్రం నుంచి చౌటుప్పల్‌కు గ్రిడ్ పైప్ లైన నుంచి మునిసిపాలిటీలోని నాలుగు ట్యాంకులకు ప్రత్యేక పైప్‌లైన్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ పైప్‌లైన్ల ఏర్పాటుపై గ్రిడ్, ప్రజారోగ్య శాఖ అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారంగా కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు. అప్పుడు 25వేల జనాబా ఉండగా, అది ఇప్పుడు లక్ష దాటింది. కొత్తగా నిర్మిస్తున్న ఈ ట్యాంకుల్లోకి కృష్ణా జలాలను పంపించాలంటే అదనంగా లింగోటం శుద్ధి కేంద్రం నుంచి పంపింగ్ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సహకారంతో త్వరిత గతిన పనులను పూర్తి చేయించి ప్రజలకు కృష్ణా జలాలను అందించాలన్న లక్ష్యంతో ప్రజారోగ్య శాఖ డీఈఈ మనోహర ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రారంభమైన అమృత 2.0 పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయించి, పట్టణంలోని ప్రజలకు కృష్ణా జలాలను అందించాలి. ప్రస్తుతం పట్టణంలోని అనేక ప్రాంతాలకు బోరు బావుల నీటినే సరఫరా చేస్తుండడంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పట్టణ ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. మిషన భగీరథ పథకం క్రింద కొన్ని కాలనీలకు మాత్రమే కృష్ణా జలాలు అందుతున్నాయి.
-కడారి కల్పనయాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు, చౌటుప్పల్
ఆరు నెలల్లో పనులు పూర్తి చేయిస్తాం
చౌటుప్పల్ మునిసిపాలిటీలోని అమృత 2.0 పథకం కింద రూ. 21 -00 కోట్ల అంచనాతో చేపట్టిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేయిస్తాం. అగ్రిమెంట్ గడువు మరో సంవత్సరం ఉంది. మూడు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతుండగా, స్థల సమస్యతో లక్కారం (8 వార్డు) లో ఒక ట్యాంకు నిర్మాణ పనులు నిలిచిపోయాయు. ప్రతీ ఇంటికి కృష్ణా జలాలను అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా పైప్‌లైన్లను ఏర్పాటు చేయిస్తాం. పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాం.
-మనోహర, డీఈఈ, ప్రజారోగ్య శాఖ, చౌటుప్పల్ డివిజన