Share News

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:08 AM

స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లా కలెక్టరేట్‌ సముదాయం విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉదయం 8.30గంటలకు కలెక్టర్‌ హనుమంతరావు పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

ముఖ్య అతిథిగా హాజరు కానున్న శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

వేడుకలకు ముస్తాబైన కలెక్టరే ట్‌, జూనియర్‌ కళాశాల ఆవరణ

భువనగిరి (కలెక్టరేట్‌),ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లా కలెక్టరేట్‌ సముదాయం విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉదయం 8.30గంటలకు కలెక్టర్‌ హనుమంతరావు పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు ముఖ్య అతిఽథిగా హాజరవుతున్న శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి 9.30 గంటలకు జెండా ఆవిష్కరిస్తారని జిల్లా పౌర సంబంధాల అధికారి అరుంధతి తెలిపారు.

కలవర పెడుతున్న వర్షాలు

భువనగిరి టౌన్‌ : స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా అం తటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్నీ ప్రభు త్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, బస్తీల్లో మువ్వన్నెల జెండాను ఘనం గా ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధుల ను స్మరించుకోనున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయిలో నిర్వహించే వేడుకలకు ము నిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశా రు. ప్రభుత్వ శాఖల అభివృద్ధి శకటాల, సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీసుల గౌరవ వందనం హైలెట్‌గా నిలువనున్నాయి. ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్న వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకలపై పలువురు కలవరపాటుకు గురవుతున్నారు.

Updated Date - Aug 15 , 2025 | 01:08 AM