Share News

రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:20 AM

డిండి, తిరుమలగిరి(సాగర్‌), ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ యాం త్రీకరణ పరికరాలు రాయితీపై అందజేస్తున్నట్లు ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులు రెహెనా, హర్షిత గురువారం తెలిపారు.

రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ  పరికరాలు

డిండి, తిరుమలగిరి(సాగర్‌), ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ యాం త్రీకరణ పరికరాలు రాయితీపై అందజేస్తున్నట్లు ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులు రెహెనా, హర్షిత గురువారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళ రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీతో పనిముట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. డిండి మండలంలో పవర్‌న్యాప్‌ సాక్స్‌స్పేయర్‌ జనరల్‌ 17, ఎస్సీ 4, ఎస్టీ 1, బ్యాటరీ, మ్యానువల్‌ ఆపరేటెడ్‌ స్ర్ఫే యర్‌ జనరల్‌ 131, ఎస్సీ 29, ఎస్టీ 12, రొటవేటర్‌ జనరల్‌ 8, ఎస్సీ 2, సీడ్‌కం ఫర్టిలైజర్‌ డ్రిల్‌ జనరల్‌ 2, ఎస్సీ 1, డిస్క్‌హెరో, కల్టివేటర్‌, ఎంబిప్లస్‌, తేజ్‌ జనరల్‌ 8, ఎస్సీ 2, ఫండ్‌ ఫార్మర్‌ నాన్‌పీటీవో ఎస్టీ 2, ఫండ్‌ ఫార్మర్‌ పీటీవో ఎస్టీ -1, పవర్‌ వీడర్‌ జనరల్‌- 1, బ్రెష్‌కట్టర్‌ జనరల్‌ 2, ఎస్సీ 1, పవర్‌ టిల్లర్‌ జనరల్‌ -1, స్ర్టాబెలర్‌ జనరల్‌ 2, ఎస్సీ-1 ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆసక్తిగల రైతులు దరఖాస్తు ఫారంపాటు పట్టాదార్‌ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు బ్యాంక్‌ ఖాతా, ఆర్సీ జిరాక్స్‌ (ట్రాక్టర్‌ సంబంధిత పరికరాలకు మాత్రమే) జతచేసి ఆగస్టు 14వ తేదీ వరకు మండల వ్యవసాయశాఖ అధికారికి అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని కోరారు.

Updated Date - Aug 08 , 2025 | 12:20 AM