Share News

ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:55 PM

సూర్యాపేటటౌన్‌, : ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శంకర్‌ అన్నారు.

  ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి) : ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శంకర్‌ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేం ద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంత్‌ సేవాలాల్‌ సూచించిన నియమాలను ఆచరిస్తూ జీవితంలో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. మూడనమ్మకాలను వీడి పేదరికం నుంచి బయటపడాలన్నారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ వసతి గృహంఅదికారులు సాయిరాములు, లింగయ్య, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

హక్కుల కోసం పోరాటం చేయాలి

హుజూర్‌నగర్‌ : ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేయాలని సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి కె.శివకుమార్‌ పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లను నిలిపివేయాలన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆదివాసీలను హింసకు గురిచేస్తున్నారన్నారు. బహుళజాతి కంపెనీలకు అటవీ సంపదను దోచిపెట్టేందుకు మావోల పేరుతో దాడులు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పల్లయ్య, సయ్యద్‌హుస్సేన్‌, రజాక్‌, సైదులు, విజయ్‌, రేష్మా, శ్యామల, నా గేంద్ర, ఫాతీమా, నర్సమ్మ, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 11:55 PM