Share News

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:10 AM

విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హె చ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

శాలిగౌరారం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హె చ్చరించారు. గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలో ని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆమె తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసి ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలు నిర్వహించాలని, వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్‌ దుకాణాన్ని తనిఖీ చేసి గోదాంలో ఉన్న స్టాక్‌ను, విక్రయాలను రిజిష్టర్లను, బిల్లులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, వనమహోత్సవం త దితర కార్యక్రమాలను సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 70శాతంలోపు గ్రౌండింగ్‌ ఉన్న చోట వేగవంతం చేసి మూడు రోజుల్లో పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో విద్యుత్‌ మరమ్మతు పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి తరగతి గదులను పరిశీలించారు. మరుగుదొడ్ల మరమ్మతులకు అంచనాలు పంపించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో అశోక్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌, జేడీఏ శ్రవణ్‌కుమార్‌, తహసీల్దార్‌ జహీరుద్దీన్‌, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఏవో సౌమ్యశృతి, కేజీబీవీ ఎస్‌వో నాగమణి ఉన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:10 AM