ప్రైవేట్ ఆస్పత్రులకు సూచిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:41 AM
చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు సూచిస్తే(రెఫర్) ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిని సోమవారం పరిశీలించారు. వసతులను, వైద్య సేవలను, ఆస్పత్రి నిర్వహణను పరిశీలించి రోగులతో మాట్లాడారు.
భువనగిరి టౌన్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు సూచిస్తే(రెఫర్) ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిని సోమవారం పరిశీలించారు. వసతులను, వైద్య సేవలను, ఆస్పత్రి నిర్వహణను పరిశీలించి రోగులతో మాట్లాడారు. నూతన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు, ఏజెంట్లను జిల్లా ఆస్పత్రిలోకి అనుమతించకూడదన్నారు. జిల్లా ఆస్పత్రిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమే్‌షరెడ్డి, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్ శ్రీశైల చిన్నానాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, కిరణ్ పాల్గొన్నారు.
సకల వసతుల పట్టణంగా భువనగిరి
సకల వసతుల పట్టణంగా భువనగిరిని తీర్చిదిద్దుతున్నట్టు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 13వ వార్డులో లోవోల్టేజీ నివారణకు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను, 9, 20, 30వ వార్డులలో వాటర్‌ఫిల్టర్లను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవేజ్‌చిస్తి, మునిసిపల్ కమిషనర్ జి. రామలింగం, డీఈ వఐ కొండల్‌రావు, మునిసిపల్ మాజీ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.