Share News

తల్లిదండ్రుల బాగోగులను విస్మరిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:25 AM

తల్లిదండ్రుల బాగోగులను విస్మరించిన కుమారులపై చర్యలు తప్పవని వయోవృద్ధుల ట్రిబ్యునల్‌ సబ్‌ డివిజనల్‌ చైర్మన, ఆర్డీవో ఎం.క్రిష్ణారెడ్డి అన్నారు.

 తల్లిదండ్రుల బాగోగులను విస్మరిస్తే చర్యలు తప్పవు
ఆర్డీవో కృష్ణారెడ్డి సమక్షంలో తల్లిదండ్రుల పోషణకు నగదును అందజేస్తున్న కుమారులు

భువనగిరి రూరల్‌/ఆత్మకూరు(ఎం), ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల బాగోగులను విస్మరించిన కుమారులపై చర్యలు తప్పవని వయోవృద్ధుల ట్రిబ్యునల్‌ సబ్‌ డివిజనల్‌ చైర్మన, ఆర్డీవో ఎం.క్రిష్ణారెడ్డి అన్నారు. ఆత్మకూర్‌(ఎం) మండలం రాఘవాపురానికి చెందిన మర్రిపల్లి నర్సయ్య తన కుమారులు తనను పోషించడం లేదని భువనగిరి ట్రిబ్యునల్‌ను సంప్రదించి, వినతిపత్రం అందజేశారు. ఎర్రగుంట వెంకటేశ ఆధ్వర్యంలో వారి కుమారులైన మర్రిపల్లి అచ్చయ్య, మర్రిపల్లి యాదయ్య, మర్రిపల్లి రమేష్‌కు నోటీసులు అందజేసి, గురువారం భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో ట్రిబ్యునల్‌లో విచారణ జరిపి ప్రతీ నెల పెద్ద కుమారుడు రూ.2వేలు, రెండో, మూడో కుమారులు రూ.1000 చొప్పున పోషణ ఖర్చుల నిమిత్తం అందజేయాలని ఆదేశించారు. నర్సయ్య బ్యాంకు అకౌంట్‌లో రూ.3.50లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించి ప్రతి నెలా వచ్చే వడ్డీతో పోషణ ఖర్చులకు ఉపయోగించే విధంగా చూడాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజీ అధికారి ఎర్రగుండ్ల వెంకటేశ, సీనియర్‌ అసిస్టెంట్‌ పీవీ హరికిషన రావు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:25 AM