Share News

దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:36 AM

ఖమ్మం జిల్లా భద్రాచలం ఈవో రమా దేవి,దేవాదాయ, దేవస్థానం సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాలయాల జేఏసీ చైర్మన గజ్వేల్లి రమే్‌షబాబు డిమాండ్‌ చేశారు.

దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

యాదగిరిగుట్ట, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా భద్రాచలం ఈవో రమా దేవి,దేవాదాయ, దేవస్థానం సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాలయాల జేఏసీ చైర్మన గజ్వేల్లి రమే్‌షబాబు డిమాండ్‌ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ వైకుంఠ ద్వారం చెంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిరస న చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్షణమే ప్రభుత్వం ఆలయ భూములను రక్షించేందుకు ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వం సహకారం అందించాలన్నారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన పురుషోత్తపట్నంలో ఆలయ భూములు రక్షించేందుకు వెళ్లిన దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు గజ్వేల్లి రఘు, ప్ర తాప నవీనకుమార్‌శర్మ, పర్యవేక్షకులు ముద్దసాని నరేష్‌, నటరాజన సంఘం నా యకులు ఎరుకల దయానంద్‌, ఊడెపు సుధాకర్‌, అన్నపూర్ణ, రత్నదీప, దొమ్మాట సత్తయ్య, బూడిద ఉమేష్‌, వై. మల్లేష్‌, జహాంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:36 AM