Share News

పేరుకుపోయిన విద్యుత బకాయిలు

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:22 AM

హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రిలో 10నెలలుగా విద్యుత బిల్లులు చెల్లించకపోవడంతో రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. 2024 జూన్‌ నుంచి నేటి వరకు ఆసుపత్రికి విద్యుత్‌ వాడుతున్నా ట్రాన్స్‌కోకు బకాయిలు చెల్లించడంలో జా ప్యం చేస్తున్నారు.

పేరుకుపోయిన విద్యుత బకాయిలు
హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రిలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌లో ఉన్న సిలిండర్లు

ఏడాదిగా రూ.40 లక్షల పైమాటే

హుజూర్‌నగర్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రిలో 10నెలలుగా విద్యుత బిల్లులు చెల్లించకపోవడంతో రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. 2024 జూన్‌ నుంచి నేటి వరకు ఆసుపత్రికి విద్యుత్‌ వాడుతున్నా ట్రాన్స్‌కోకు బకాయిలు చెల్లించడంలో జా ప్యం చేస్తున్నారు. 100పడకల ఆసుపత్రికి సంబంధించి ప్రతినెలా రూ.1.50 లక్షల కరెంట్‌ బిల్లు వస్తోంది. దాంతో పాటు ఆక్సిజన్‌ ప్లాంట్‌కు ప్రతినెలా రూ.50వేల వరకు బిల్లు వస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపా యి. ఆసుపత్రి బిల్లుకు ఇది అదనం. గత ఏడాది కాలంగా రూ.40 లక్షలపైన కరెంట్‌ బిల్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇదిలా ఉండగా ఆక్సిజ న్‌ ప్లాంట్‌కు సంబంధించి మినిమం బిల్లు రూ.50వేల వరకు వస్తుండగా ఈ మీటర్‌ ద్వారా పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక బోరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ మీటర్‌ను నీటి సరఫరా బోరుకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో నామినల్‌ బిల్లు కూడా వాటర్‌ సరఫరాలోనే కలుపుతున్నారు. కరోనా సమయంలో సుమారు 70సిలిండర్లకు సరిపడా ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. వాటిల్లో 11సిలిండర్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సమయంలో మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ విద్యుత బిల్లు కూడా ఏడాదికాలంగా చెల్లించడం లేదని సమాచారం. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని ట్రాన్సకో అధికారులు కోరుతున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:23 AM