Share News

అర్హులందరికీ అక్రిడిటేషన కార్డులు ఇవ్వాలి

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:41 AM

జర్నలిస్టుల హక్కులను హననం చేసే జీవో నెం.252ను సవరించాలని టీయూడబ్ల్యూజే (హెచ-143) యూనియన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్‌ అన్నారు.

అర్హులందరికీ అక్రిడిటేషన కార్డులు ఇవ్వాలి
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

భువనగిరి (కలెక్టరేట్‌), డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల హక్కులను హననం చేసే జీవో నెం.252ను సవరించాలని టీయూడబ్ల్యూజే (హెచ-143) యూనియన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఎదుట శనివారం జర్నలిస్టులు ధర్నాచేసి కలెక్టర్‌ హనుమంతరావుకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. గతంలో జీవో 239 ప్రకారం 20మంది జర్నలిస్టులకు బదులు 12మందికే పరిమితం చేయడం సరికాదన్నారు. మీడియం పత్రికలు, శాటిలైట్‌ ఛానళ్లకు గణనీయంగా కోత పడిందన్నారు. డెస్క్‌ జర్నలిస్టులు, ఫీల్డ్‌ జర్నలిస్టులను వేరుచేసి మీడియా కార్డు పేరిట విభజన చేయడం తగదన్నారు. జర్నలిస్టులను విభజించకుండా అక్రిడియేషన జర్నలిస్టుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవరించాలని డిమాండ్‌ చేశారు. యూనియన జిల్లా అధ్యక్షుడు జూకంటి అనిల్‌, ఫొటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గంధమల్ల రాజు, రాష్ట్ర నాయకులు కేతావత తిరుపతి నాయక్‌, బూడిద శ్రీహరి, రాగి సహదేవ్‌, హమీద్‌పాష, కళ్లెం సంపత, నాయకులు పుట్ట హనుమంత, పాండు, గడ్డమీది చంద్రం, కురిమిళ్ల రాజు, శక్రునాయక్‌, ఆరె భాను, ఆరుట్ట కిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:41 AM