ఫీజల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:56 PM
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించి, ప్రతీ ఒక్కరికి విద్యను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర నాయకుడు బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు.

చౌటుప్పల్ టౌన, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించి, ప్రతీ ఒక్కరికి విద్యను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర నాయకుడు బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ నగరాల్లో ఉండే కార్పొరేట్ విద్యాసంస్థలు నేడు గ్రామాలకు విస్తరించి విద్యార్థుల తల్లి దండ్రులను దోపిడీకి గురిచేస్తున్నాయని అన్నారు. ఈ సంస్థల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో మధ్య తరగతి విద్యార్థులు కూడ చదవలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఏ పార్టీలు అధికారంలో ఉన్నా కార్పొరేట్ విద్యాసంస్థలకే వత్తాసు పలుకుతున్నాయని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు సరిపడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. విద్యారంగ సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలని, చదువుతూ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు చింతల శివ, జిల్లా కార్యదర్శులు ఎల్.రాజు, తిగుళ్ల శ్రీనివాస్, నాయకులు నాగరాజు, రాహుల్, ఉదయ్‌కుమార్, గాయత్రి పాల్గొన్నారు.