రైల్వే చార్జీలు స్వల్పంగా పెరుగుదల
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:05 AM
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వేది కీలక పాత్ర. మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్న ఇండియన్ రైల్వే ప్రయాణికులపై కాస్త భారం మోపనుంది. ఐదేళ్లుగా స్థిరంగా ఉన్న రైలు టికెట్ ధరలను సవరించి, స్వల్పంగా పెంచింది.
నేటి నుంచి అమలు
(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ టౌన్): ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వేది కీలక పాత్ర. మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్న ఇండియన్ రైల్వే ప్రయాణికులపై కాస్త భారం మోపనుంది. ఐదేళ్లుగా స్థిరంగా ఉన్న రైలు టికెట్ ధరలను సవరించి, స్వల్పంగా పెంచింది. పెరిగిన టికెట్ ధరలు మంగళవారం నుంచి అమలు లోకి రానున్నాయి. అయితే. 2013, 2020లో టికెట్ ధరల సవరణతో పోలిస్తే ప్రస్తుత పెంపు నామమాత్రమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ, సెకండ్ క్లాస్ రైలు ప్రయాణంలో 500కిలోమీటర్ల లోపు ప్రయాణానికి టికెట్ ధరలను మార్పులు చేయలేదు. అంతకంటే ఎక్కు వ దూరం ప్రయాణిస్తే కిలోమీటరుకు అరపైస చొప్పున పెంచుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిం ది. ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికె ట్ ధరలు కిలోమీటర్‌కు అర పైసా, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్‌క్లాస్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరను కిలోమీటర్‌కు ఒక పైసా, ఏసీ చైర్ కార్, ఏసీ త్రీ టైర్, ఏసీ టూ టైర్, ఏసీ ఫస్ట్‌క్లాస్ టికెట్ ధరలను కిలోమీటర్‌కు రెండు పైసలు ఇండియన్ రైల్వే పెంచింది. సబర్బన్ రైళ్లు, సీజనల్ టికెట్లపై 500 కిలోమీటర్లలోపు ప్రయాణ టికెట్లపై ఎటువంటి పెంపు లేదు. అయితే పెరిగిన ధరలు ప్రయాణికులపై పెద్దగా ప్రభావం చూపవని వినియోగదారుల సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
దశలవారీ పెంపు కోసమేనా?..
ప్రయాణికులపై ప్రభావం పడకుండా దశలవారీగా టికెట్ ధరల పెంపునకు కేంద్రప్రభు త్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం. రైల్వే సహాయ మంత్రి సోమన్న ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం దశలవారీగా రైల్ టికెట్ ధరల ను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులపై భారం ఆర్ధిక భారం పడకుంగా ఏసీ, త్రీ టైర్, ఫస్ట్‌క్లా్‌సల టికెట్ ధరలను సవరించడంతో పాటు స్వల్పంగా పెంచేదిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన ఇటీవల తెలిపారు.
ఓటీపీ వస్తేనే సుమా..!
టికెట్ ధరలను నామమాత్రంగా పెంచిన భారతీయ రైల్వే తాత్కాల్ టికెట్ బుకింగ్‌లోనూ చేసిన కీలక మార్పులు జూలై 1నుంచి అమల్లోకి వచ్చాయి. టికెట్ బుకింగ్‌కు గుర్తింపు కార్డును ఇప్పటికే తప్పనిసరి చేసిన ఇండియన్ రైల్వే తాత్కాల్ టికెట్ బుకింగ్‌కై ఆధార్‌తో అనుసంధానం చేసిన మొబైల్‌కు ఓటీపీ పంపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే టికెట్ బుక్ అయ్యేట్లుగా మార్పులు చేయడం గమనార్హం.
జిల్లా మీదుగా పలు రైళ్లు
జిల్లా మీదుగా 50కి పైగా రైళ్లు వెళ్తన్నాయి. ఇటు గుంటూరు, తిరుపతి, చెన్నై, కేరళ, విజయవాడ, వైజాగ్, కలకత్తా నగరాలకు, అటు నల్లగొండ, హైదరాబాద్, సికింద్రాబాద్, షిర్డీ, ముంబై వైపునకు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా జిల్లాలోని రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా కేంద్రప్రభుత్వం ఆధునీకరిస్తోంది. మరోవైపు పగిడిపల్లి-నల్లపాడు వరకు డబ్లింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ప్రయాణికులకు నాణ్యమైన సేవలు : సతీష్ నావిళ్ల, చీఫ్ కమర్షియల్ ఇన్స్‌పెక్టర్, నల్లగొండ
ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌పై స్టేషన్లకు సమాచారం అందింది. టికెట్ ధరల పెంపు నామమాత్రంగానే ఉంది. సాధారణ, సెకండ్ క్లాస్ టికెట్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఏసీ, త్రీటైర్, ఫస్ట్‌క్లాస్ తరగతుల్లో కిలోమీటర్‌కు అరపైస నుంచి రెండు పైసలు మాత్రమే పెంచుతూ రైల్వేఖా సర్క్యులర్ జారీ చేసింది.
ప్రయాణం సుఖమయంగా మారింది : తల్లం అశోక్ , రైస్ మిల్లర్, ఇండస్ట్రియల్ సెల్ జిల్లా కన్వీనర్, మిర్యాలగూడ
గతంతో పోలిస్తే రైల్వే ప్రయాణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రయాణం సఖమయంగా, వేగవంతంగా మారింది. టికెట్ బుకింగ్ విధానాన్ని అప్డేట్ చేసింది. లక్షమంది ప్రయాణికులు ఒకేసారి బుక్ చేసుకునేలా సర్వర్లను, సాంకేతికతను అభివృద్ధి చేయడం గొప్ప విషయం. ఇక స్వల్పంగా పెరిగిన ధరలు పేద, మద్యతరగతి వర్గ ప్రయాణికులపై ఎంతమాత్రం ప్రభావం చూపవు.