భక్తిశ్రద్ధలతో శీత్లా పండుగ
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:58 PM
ీశీత్లా పండుగను భువనగిరి మండల పరిధిలోని ఆకుతోట బావి తండాలో గిరిజన మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
భువనగిరి రూరల్/ తుర్కపల్లి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ీశీత్లా పండుగను భువనగిరి మండల పరిధిలోని ఆకుతోట బావి తండాలో గిరిజన మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సామూహికంగా గిరిజన మహిళలు డప్పు వాయిద్యాలతో తండాలోని ముఖ్య కూడళ్లలో ప్రత్యేక వంటకాలను తయారు చేసిన నైవేద్యాన్ని సీత్లాభవాని మాతకు సమర్పించారు. ఆరోగ్యం బాగుండాలని, సకాలంలో వర్షాలు కురవాలని సీత్లాభవాని దేవతను ప్రార్థించారు. తుర్కపల్లి సీత్లా పండుగను మంగళవారం మండలంలోని రామాపురం తండాలో గిరిజనులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుగులోత బద్దునాయక్, ఏఎంసీ డైరక్టర్ పట్టునాయక్, మహేందర్ పాల్గొన్నారు.