Share News

గుట్టలో మెడికల్‌ కళాశాల నిర్మించాలి

ABN , Publish Date - May 28 , 2025 | 12:32 AM

యాదగిరిగుట్టకు గతంలో మంజూరైన మెడికల్‌ కళాశాల నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

గుట్టలో మెడికల్‌ కళాశాల నిర్మించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌

యాదగిరిగుట్ట రూరల్‌, మే 27, (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్టకు గతంలో మంజూరైన మెడికల్‌ కళాశాల నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం గుట్ట మండలంలోని మైలారిగూడెం గ్రామంలో సీపీఎం మండల స్థాయి ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నంబర్‌ 85 ద్వారా రెండు సంవత్సరాల క్రితం మెడికల్‌ కళాశాలను మంజూరు చేసినట్లు గొప్పగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదని అన్నారు. పట్టణంలో పాతగుట్ట రోడ్డు పూర్తిగా శిథిలమై, ఆ రోడ్డు వెంట ప్రయాణించాలంటే ప్రజలు ఎప్పుడూ ఏ ప్రమాదం ముచ్చుకు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు. తక్షణమే రోడ్డు పనులు మొదలు పెట్టాలని, గుట్ట మునిసిపల్‌ భనవ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితం అయ్యిందని, వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో జూన్‌ 9నుంచి 11వరకు జరిగే సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం, అధ్యక్షుడు బబ్బూరి పోశెట్టి, ప్రఽధాన కార్యదర్శి నూకల భాస్కర్‌రెడ్డి, కోశాధికారి ఎస్‌కె.షరీఫ్‌, మీడియా ఇన్‌చార్జి పేరబోయిన నర్సింహ పాల్గొన్నారు.యాదగిరిగుట్టకు గతంలో మంజూరైన మెడికల్‌ కళాశాల నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం గుట్ట మండలంలోని మైలారిగూడెం గ్రామంలో సీపీఎం మండల స్థాయి ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నంబర్‌ 85 ద్వారా రెండు సంవత్సరాల క్రితం మెడికల్‌ కళాశాలను మంజూరు చేసినట్లు గొప్పగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదని అన్నారు. పట్టణంలో పాతగుట్ట రోడ్డు పూర్తిగా శిథిలమై, ఆ రోడ్డు వెంట ప్రయాణించాలంటే ప్రజలు ఎప్పుడూ ఏ ప్రమాదం ముచ్చుకు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు. తక్షణమే రోడ్డు పనులు మొదలు పెట్టాలని, గుట్ట మునిసిపల్‌ భనవ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితం అయ్యిందని, వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో జూన్‌ 9నుంచి 11వరకు జరిగే సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం, అధ్యక్షుడు బబ్బూరి పోశెట్టి, ప్రఽధాన కార్యదర్శి నూకల భాస్కర్‌రెడ్డి, కోశాధికారి ఎస్‌కె.షరీఫ్‌, మీడియా ఇన్‌చార్జి పేరబోయిన నర్సింహ పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:32 AM