Share News

ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కంచె

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:44 AM

సూర్యాపేట క్రైం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో మూత్రవిసర్జన చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అధికారులు స్పందించారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కంచె

ఫ దిద్దుబాటు చర్యలు చేపట్టిన విద్యుత్‌ శాఖ అధికారులు

సూర్యాపేట క్రైం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో మూత్రవిసర్జన చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అధికారులు స్పందించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టు ఇనుప విద్యుత్‌ అధికారులు కంచెను ఏర్పాటుచేశారు. సూర్యాపేట పట్టణంలోని నల్లాలబావి సెంటర్‌లో నివాసం ఉంటున్న దంతాల చక్రధర్‌రావు(56) ఈ నెల 19న వాణిజ్యభవన్‌ పక్కన ఏర్పాటుచేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆ సమయంలో చిరుజల్లులు కురుస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్పందించిన విద్యుత్‌ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బుధవారం ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. పట్టణంలో అనేక చోట్ల ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయని వాటికి కూడా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:44 AM