మహిళల అభ్యున్నతికి పెద్దపీట
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:17 AM
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
భువనగిరి రూరల్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ఇందిరా మహిళ శక్తి పథకం కింద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక అభ్యున్నతి ఆత్మాభిమానం పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన రేఖ బాబురావు, టీజీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి సురేందర్‌రెడ్డి నాయకులు పచ్చిమట్ల శివరాజు గౌడ్, రావి సురే్‌షరెడ్డి, సుక్క స్వామి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, జక్కుల వెంకటేష్ పాల్గొన్నారు.
గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
వలిగొండ : నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని రంగాలలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. అంతర్గత రోడ్లు డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని వివరించారు. తమ ప్రజాపాలన ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందలేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన భీమానాయక్, మత్స్యగిరి దేవస్థాన చైర్మన నరే్‌షకుమార్‌రెడ్డి, అరూరు పీఏసీఎస్ చైర్మన చిట్టెడి వెంకట్‌రాంరెడ్డి, మాజీ ఎంిపీపీలు నూతి రమే్‌షరాజు, చిట్టెడి జనార్ధనరెడ్డి, నాయకులు పాషం సత్తిరెడ్డి, కుంభం వెంకటపాపిరెడ్డి, తుమ్మల శ్రీనివాస్, సహదేవ్, లింగయ్య, చెరుకు శివయ్య, చిలుగూరి సత్తిరెడ్డి, సతీష్, రాంరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.