Share News

విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు

ABN , Publish Date - May 22 , 2025 | 12:28 AM

విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం జలగం జనార్ధన(జన్నుసార్‌) అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో జనార్ధన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు
జనార్ధన(జన్ను) విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్‌లైన నాయకులు

నిదర్శనం జనార్ధన

సూర్యాపేటటౌన, మే 21 (ఆంధ్రజ్యోతి): విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం జలగం జనార్ధన(జన్నుసార్‌) అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో జనార్ధన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. జనార్ధన ప్రజల కోసమే జీవించాడని గుర్తుచేశారు. ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని, ఆయన ఆశయాలను నేటి యువత సాధించాలన్నారు. దేశంలో ప్రధాని మోదీ ఫాసిస్ట్‌ విధానాలతో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎనకౌంటర్ల పేరుతో నిరంకుశ, రాజ్యహింస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు మావోయిస్టులను, అమాయకపు ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తూ ఎనకౌంటర్లు చేయడం దారుణమన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. ప్రజల తరుపున సీపీఐ(ఎంఎల్‌)మా్‌సలైన నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలు అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన జిల్లా ఇనచార్జి, రాష్ట్ర కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్‌రావు, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌, పీవోడబ్లూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, నాయకులు ఎర్ర అఖిల్‌కుమార్‌, పేర్ల నాగయ్య, గొడ్డలి నర్సయ్య, వాసా పల్లయ్య, సూరం రేణుక, సంతోషిమాత, పద్మ, సయ్యద్‌హుస్సెన, వీరబాబు, కట్టారమేష్‌, లింగయ్య పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:28 AM