10లో 7వ స్థానం
ABN , Publish Date - May 01 , 2025 | 01:03 AM
జిల్లాలో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 98.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదికం టే ప్రస్తుతం మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాది జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 25వ స్థా నం రాగా, ప్రస్తుత ఫలితాల్లో 97.80శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో ఏడో స్థానం దక్కించుకుంది.
97.80శాతం ఉత్తీర్ణత
మెరుగుపడిన ఫలితాలు
బాలికలదే హవా
యాదాద్రి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 98.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదికం టే ప్రస్తుతం మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాది జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 25వ స్థా నం రాగా, ప్రస్తుత ఫలితాల్లో 97.80శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో ఏడో స్థానం దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 8,622 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 8,432మంది (97.80శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 4,215మంది పరీక్షలకు హాజరుకాగా, 4,111మంది (97.53శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 4,407మంది పరీక్షలకు హాజరుకాగా 4,321మంది (98.05శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 0.52శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 156, మోడల్ స్కూళ్లు ఏడు, కస్తుర్బాగాంధీ పాఠశాలలు 11, రెసిడెన్సియల్ 14, ఎయిడెడ్ ఒకటి, ప్రైవేట్ పాఠశాలలు 73 వరకు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌తోపాటు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి.
పక్కా ప్రణాళికతో ముందుకు
పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుం ది. పదో తరగతి సిలబ్‌సను జనవరిలోనే పూ ర్తిచేశారు. ఆ తరువాత విద్యార్థులకు పునశ్చరణ (రివిజన్) తరగతులు నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను ఉపాధ్యాయులు పూర్తి సంసిద్ధులను చేయడంతో ఫలితం లభించింది.
మూడేళ్లుగా ఫలితాలు ఇలా..
సంవత్సరం అభ్యర్థులు ఉత్తీర్ణత శాతం
2022-23 8,973 7,265 80.97
2023-24 9,108 8,237 90.44
2024-25 8,622 8,432 97.80