Share News

బాలికపై లైంగికదాడి కేసులో 21ఏళ్ల జైలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:24 AM

బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 21ఏళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విఽధిస్తూ నల్లగొండ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

బాలికపై లైంగికదాడి కేసులో 21ఏళ్ల జైలు

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 21ఏళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విఽధిస్తూ నల్లగొండ న్యాయస్థానం తీర్పునిచ్చింది. సోమవారం నల్లగొండ జిల్లా రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు, అత్యాచారం, పోక్సో కేసుల ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి ఎన.రోజారమణి ఈ మేరకు తీర్పు ప్రకటించారు. కేసు వివరాల్లోకి వెళితే చిట్యాల మండలం వనిపాకలకు చెందిన దోమల రాములు 2018సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన మద్యం మత్తులో గ్రామంలోని ఓ ఇంట్లో టీవీ చూస్తోన్న బాలికను బెదిరించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తొలుత ఎవరికీ చెప్పకుండా తనలో తాను మదనపడింది. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించి తల్లిదండ్రులు ఆరా తీయగా తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో బాలిక తండ్రి అదే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన చిట్యాల పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 448, 506, 376 (2)(ఐ) కింద, పోక్సోచట్టం -2012 సెక్షన్లు 5(ఎం), 6 కింద కేసు నమోదు చేసిన చిట్యాల పోలీసులు దర్యాప్తు నిర్వహించి, నిందితుడు లైంగికదాడి చేసిన విషయాన్ని సరైన ఆధారాలతో కోర్టులో నిరూపించారు. నిందితుడు బాలికను బెదిరించి ఆమెపై లైంగికదాడికి పాల్పడిన విషయం నిరూపితమవడంతో పోక్సో చట్టం 2012 సెక్షన 5 (ఎం) కింద సెక్షన -6 ప్రకారం 20ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించారు. నిందితుడు బాలిక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఐపీసీ సెక్షన-448 కింద ఏడాది జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. మొత్తం రెండు శిక్షలు కలిపి 21ఏళ్ల జైలుశిక్ష, రూ.30వేల జరిమానా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలుచేయాలని ఆదేశించినందున నిందితుడు 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అదేవిధంగా బాధితురాలికి ఉపశమనం, పునరావాసం నిమిత్తం జిల్లా న్యాయ సేవా సహకార సంస్థ ద్వారా రూ.10లక్షల పరిహారాన్ని వీలైనంత త్వరగా అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ కేసులో ప్రాసిక్యూషన తరుపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వేముల రంజితకుమార్‌ వాదించారు. కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో దాఖలు చేసేందుకు ప్రాసిక్యూషనకు సహకరించిన అప్పటి సీఐ పాండురంగారెడ్డి, ఎస్‌ఐ సైదాబాబు, ప్రస్తుత సీఐ కె.నాగరాజు, ఎస్‌ఐ రవికుమార్‌, సీడీవో యాదయ్య, భరోసా సెంటర్‌ లీగల్‌ అధికారి కల్పన తదితరులను నల్లగొండ జిల్లా ఎస్పీ శరతచంద్రపవార్‌ అభినందించారు.

Updated Date - Sep 16 , 2025 | 12:24 AM