Share News

15 మంది ద్విచక్రవాహనాల దొంగల అరెస్ట్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:16 AM

హాలియా, జూలై 25 (ఆంధ్రజ్యోతి):ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ తెలిపారు. శుక్రవారం హాలియా పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

  15 మంది ద్విచక్రవాహనాల దొంగల అరెస్ట్‌

హాలియా, జూలై 25 (ఆంధ్రజ్యోతి):ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ తెలిపారు. శుక్రవారం హాలియా పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌ 19, 22 తేదీల్లో హాలియా బస్టాండ్‌ వద్ద పార్క్‌ చేసిన రెండు ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. ఈ ఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న హాలియా ఎస్‌ఐ, సిబ్బంది అలీనగర్‌ చెక్‌పోస్టు వద్ద, అనుముల ద్వారకాపురి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహ్మద్‌జానీ, దేపనబోయిన శ్రీను, వేముల నాగరాజు అనుమానాస్పదంగా సరైన వాహన కాగితాలు లేకుండా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు 10ద్విచక్రవాహనాలను చోరీచేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ద్విచక్రవామనాలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు హాలియా, నిడమనూరు, హైదరాబాద్‌లోని ఆదిబట్ల, మిర్యాలగూడ, మాచర్ల, గుంటూరు, రెంటచింతల, కారంపూడి ప్రాంతాల్లో ఆర్‌టీసీ బస్టాండ్లలో పార్క్‌ చేసిన ద్విచక్రవాహనాలకు నకిలీ తాళాలు చేయించి దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు మహ్మద్‌జానీ నుంచి ఆరు, దేపనబోయిన శ్రీను, వేముల నాగరాజు నుంచి నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనుముల మండలం అలీనగర్‌లో మహ్మద్‌జానీ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్‌ గ్రామానికి చెందిన దేపనబోయిన శ్రీను, వేముల నాగరాజులు వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు.

ఫ త్రిపురారం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బాబుసాయి క్రాస్‌రోడ్డు వద్ద ఎస్‌ఐ, సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఆరుగురు ద్విచక్రవాహనాలపై వస్తూ పోలీసులను చూసి తిరిగి పారిపోయే ప్రయత్నం చేశారని ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. వారి నుంచి 10 ద్విచక్రవాహనాలు, ఏడు సెలఫోన్లు, 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్లో రమావత్‌ వంశీ, కుర్ర తుల్స్యాలది అడవిదేవుపల్లి మండలం బాలెంపల్లి కాగా, నాగార్జునసాగర్‌లోని ఫైలాన్‌కాలనీకి చెందిన కొల్లపూడి వంశీ, దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ధీరావత్‌ వంశీ, మునోతు కిరణ్‌, హైదరాబాద్‌లోని తుర్కయంజల్‌ ప్రాంతానికి కనపర్తి ప్రవీణ్‌లుగా తెలిపారు. కేసును ఛేదించిన హాలియా సీఐ దేవిరెడ్డి సతీ్‌షరెడ్డి, హాలియా ఎస్‌ఐ సాయిప్రశాంత్‌, త్రిపురారం ఎస్‌ఐ నరేష్‌, పోలీస్‌ సిబ్బంది సురేష్‌, హరిప్రసాద్‌, రమే్‌షగౌడ్‌, శ్రవణ్‌, శివరాజ్‌, సుభాష్‌, నాగరాజు, రవి, శ్రీనివాస్‌, రాము, జానీపాష, రఫీలను ఎస్పీ అభినందించారు. ఆయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:16 AM