నైపుణ్యాలకు పెద్దపీట
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:37 AM
మానవ మేథస్సును మించి ఆలోచన చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ప్రతీ విభాగంలోనూ కృత్రిమ మేఽథ చొచ్చుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాణాత్మకమైన విద్య అవసరం. అందుకే భారత ప్రభుత్వం వినూత్న పఽథకాన్ని రూపొందించింది. విద్య, అభ్యాసం వాస ్తవ ప్రపంచ అనుభవాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయోగాలు చేయదలిచింది. అందు లో భాగంగానే విద్య, ఉద్యోగార్థులకు ఆచరాణత్మకమైన ఇంటర్న్‌షిప్ అందించడంతో పాటు స్టైఫండ్ ఇవ్వనుంది. (ఆంధ్రజ్యోతి - మిర్యాలగూడ టౌన్)

భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన పథకమే పీఎం ఇంటర్న్‌షిప్. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఐటీఐ, ఏఐసీఈటీ గుర్తింపు పొందిన డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యనభ్యసించిన అభ్యర్ధులు అర్హులు. 21 నుంచి 24 ఏళ్ల లోపు వయసుంచి నిర్దేశించిన విద్యార్హతలు కలిగిన విద్యార్థులు/అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలను సంబంధిత అధికారులు పరిశీలించి తుది జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ పఽథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 చివరి తేదీ.
ఐదేళ్లలో కోటి మందికి..
2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా ఐదేళ్లలో కోటి మంది విద్యార్థ్ధులకు ఉద్యోగపరమైన శిక్షణనిస్తుందీ పథకం. పైలట్ ప్రాజెక్టుగా తొలు త లక్షా 25 వేల మందిని ఇంటర్న్‌షి్‌పనకు ఎంపిక చేస్తారు. దేశంలోని ప్రముఖ 549 సంస్థలలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది.
పేరొందిన సంస్థల సహకారంతో...
దేశంలోని 25 రంగాలకు సంబంధించిన సం స్థల సహకారంతో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం నడవనుంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, ఎలకా్ట్రనిక్స్. ట్రాన్స్‌పోర్ట్, సోలార్ సిస్టమ్ తదితర 25 విభాగాల్లో ప్రఖ్యాతి చెందిన బహుళజాతి సంస్థలు ఈ పథకం ద్వా రా ఎంపికైన ఉద్యోగార్థ్ధులకు సంవత్సర కాలం వేతనంతో (కేంద్రపభుత్వం రూ. 4,500, సదరు సంస్థ రూ. 500 మొత్తం కలిపి రూ. 5వేలు) కూడిన శిక్షణ అందిస్తాయి.
అర్హులు, అర్హతలివే..
పీఎంఐఎస్ పఽథకానికి దేశంలోని అన్ని
రాష్ట్రాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతా
లకు చెందిన 21 నుంచి 24 ఏళ్ల లోపు
విద్యా ర్థులు దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుదారుడి కుటుంబ సంవత్సర
ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి
దరఖాస్తుదారుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడి
కుటుంబ సభ్యుడై ఉండరాదు.
పఽథకంలో పేర్కొన్న విద్యార్హతలు పూర్తి
చేసి ఉండాలి.(అంటే ప్రస్తుతం ఆయా
కోర్సులు చదువుతున్న వాళ్లు కాదు..
సదరు విద్యార్హతలను పూర్తి చేసి ఉండాలి)
ఉపయోగాలివే..
ఉపాధి, నైపుణ్యాభివృద్ధిని కల్పిస్తూ రూపొందించిన పథకమే పీఎం ఇంటర్న్‌షిప్. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించడంతో పాటు విద్యార్హతలకు అనుగుణంగా స్టైఫండ్ అందిస్తారు. తొలి దిశలో 37వేల మంది పట్టభద్రులకు, 23వేల మంది ఐటీఐ సర్టిఫికెట్ హోల్డర్లు, ఏఐసీటీ ఈ గుర్తింపు పొంది, ఇంటర్ పూర్తి చేసిన 18 వేల మందికి, పదో తరగతి పూర్తి స్థాయిలో 25వేల మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం క ల్పించనున్నట్లు కేంద్ర వ్యవహారాల శాఖ పేర్కొంది.