పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:12 PM
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యా ర్థులు వంద శాతం ఉత్తీ ర్ణత సాధించాలని జిల్లా వి ద్యాశాఖాధికారి రమేష్ కు మార్ అన్నారు.

- డీఈవో రమేష్
కోడేరు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యా ర్థులు వంద శాతం ఉత్తీ ర్ణత సాధించాలని జిల్లా వి ద్యాశాఖాధికారి రమేష్ కు మార్ అన్నారు. బుఽధవా రం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్, జీపీఎస్, సీపీఎస్‌లను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలు సుకున్నారు. పదవ తరగతి విద్యార్థులతో ము ఖాముఖి మాట్లాడుతూ వారికి అందుతున్న వి ద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. వి ద్యార్థులను బ్లాక్‌బోర్డుపై రాయించి వారి సా మర్థ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో తెలు గు, ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను చదివించారు. వి ద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను ప రిశీలించారు. పరిసరాలను పరిశీలించి విద్యార్థు లకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీ లించారు. ఆయన వెంట ఎంఈవో భాస్క ర్‌శ ర్మ, పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.
నిధులను వినియోగించుకోవాలి
పెద్దకొత్తపల్లి : పాఠశాలలకు విడుదలైన ని ధులను అభివృద్ధి పనులకు వినియోగించుకో వాలని డీఈవో రమేష్‌కుమార్ వెల్లడించారు. బుధవారం మండలంలోని చంద్రకల్, పెద్దకొత్త పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను, పెద్దకొత్త పల్లిలో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలల గణి త, సైన్స్, సోషల్ ఉపాధ్యాయుల స్కూల్ కాం ప్లెక్స్ సమావేశాలను డీఈవో పరిశీలించారు. డీఈవో వెంట సెక్టోరియల్‌అధికారి వెంకటయ్య, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.