PSHMA Elections: పీఎస్‌హెచ్‌ఎంఏ అధ్యక్షుడిగా మురళీధర్ గౌడ్
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:39 AM
తెలంగాణ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం పీఎస్‌హెచ్‌ఎంఏ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి...
ప్రధాన కార్యదర్శిగా రచ్చ మురళి
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం( పీఎస్‌హెచ్‌ఎంఏ) రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. 33 జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గద్వాల జిల్లాకు చెందిన డి.మురళీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ నుంచి రచ్చ మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా నరేందర్ రెడ్డి(మెదక్), అసోసియేట్ అధ్యక్షులుగా అంకం నరే్‌ష(నిజామాబాద్), కొడపర్తి సోమయ్య(భువనగిరి), బత్తుల సదానందం(హన్మకొండ),బి.రాజ్‌కుమార్(కామారెడ్డి) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డి.మోహన్ (కామారెడ్డి), వి.గాలయ్య (మెదక్), బి.హన్మంతరావు (నిజామాబాద్), కె.లక్ష్మణస్వామి (పెద్దపల్లి), కె.రాజశేఖర్ రెడ్డి(గద్వాల), పి.అంజయ్య(రంగారెడ్డి), ఎల్.రమేష్ నాయక్ (భూపాలపల్లి), సిహెచ్.నర్సింగరావు(మేడ్చల్), పి.చంద్రశేఖర్(వనపర్తి), ఎస్.కిషన్(రంగారెడ్డి), మహిళా ఉపాధ్యక్షులుగా కె.లక్ష్మి తులసి(కామారెడ్డి), జి.కమల(మేడ్చల్), భాగ్యరేఖ (రంగారెడ్డి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.