Share News

పసుపు బోర్డు ఏర్పాటుతో బహుళ ప్రయోజనాలు

ABN , Publish Date - Jan 19 , 2025 | 01:45 AM

కేంద్ర ప్రభుత్వం నిజా మాబాద్‌ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో బహుళ ప్ర యోజనాలు అందనున్నాయని జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి అన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటుతో బహుళ ప్రయోజనాలు
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ గంగారెడ్డిని సత్కరిస్తున్న జగిత్యాల బీజేపీ నాయకులు

- జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి

జగిత్యాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నిజా మాబాద్‌ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో బహుళ ప్ర యోజనాలు అందనున్నాయని జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి అన్నారు. శనివారం జగిత్యాలకు చెందిన పలువురు బీజే పీ నాయకులు, కార్యకర్తలు నిజామబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఇటీ వల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అం దించడంతో పాటు పూలమాలలు, శాలువలతో సత్కరించారు. ఈ సందర్బంగా గంగారెడ్డి మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మ పురి అర్వింద్‌ ప్రత్యేక కృషితో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. పసుపు బోర్డు తొలిచైర్మన్‌గా తనను నియమిం చ డం సంతోషకరమన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల పసుపు నకు గిట్టుబాటు ధర రావడంతో పాటు పసుపు అనుబంద పరిశ్రమలు ఏర్పడే అవకాశాలున్నాయని, పసుపు ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్నారు. పసుపు రైతులు కొన్ని దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో జగి త్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొక్కు గంగాధర్‌, నాయకులు ఇట్నే ని రమేశ్‌, పెద్ద గంగారాం, సుంకెట దశరథరెడ్డి, నలువాల తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 01:45 AM