Most Wanted Uppala Satish: మాజీ కేంద్రమంత్రి కొడుకును మోసం చేసిన మోస్ట్ వాంటెడ్ ఫ్రాడ్ అరెస్ట్
ABN , Publish Date - Nov 22 , 2025 | 08:28 AM
మరోసారి టాస్క్ ఫోర్స్ పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేశారు. అతడ్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇవాళ ప్రాథమిక విచారణ అనంతరం సతీష్‌ను రిమాండ్ చేయనున్నారు.
హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్ పోలీసులకు చిక్కాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు సతీష్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. 25 కోట్ల రూపాయల మోసం కేసులో ఉప్పల సతీష్‌ను ఈ రోజు (శనివారం) సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు. సతీష్‌ను గత నెల 23వ తేదీనే టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ బృందం అరెస్ట్ చేసింది. అయితే, అరెస్ట్ అనంతరం ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సతీష్‌ను తప్పించాడని సమాచారం. శ్రీకాంత్.. సతీష్ నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకుని తప్పించాడన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా, మరోసారి టాస్క్ ఫోర్స్ పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేశారు. ఇవాళ ప్రాథమిక విచారణ అనంతరం సతీష్‌ను రిమాండ్ చేయనున్నారు. కాగా, పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తానంటూ అనేక మందిని సతీష్ మోసం చేశాడు. కొంతకాలం లాభాలు ఇచ్చి అనంతరం ముఖం చాటేశాడు. సతీష్ కారణంగా మోసపోయిన వారిలో మాజీ కేంద్ర మంత్రి కుమారుడు కూడా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
లోన్ యాప్... తస్మాత్ జాగ్రత్త
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..