ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని పాటించాలి
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:03 AM
జిల్లా వ్యాప్తం గా అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మంది రంలో మండల ప్రత్యేకాధికారులు, జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రత్యేకాధికారులతో వివిధ అంశాలపై ప్రత్యే క సమీక్ష నిర్వహించారు.

జగిత్యాల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తం గా అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మంది రంలో మండల ప్రత్యేకాధికారులు, జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రత్యేకాధికారులతో వివిధ అంశాలపై ప్రత్యే క సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున కోడ్ అమలులోకి వచ్చినట్లయిం దన్నారు. రాబోయే మూడు రోజుల్లో ప్రభుత్వ కార్యాల యాల్లో, ప్రయివేటు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, గోడ రాతలను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడినట్లయితే నిర్వహణకు అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రధానంగా ఓటరు లిస్టును సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో ఆస్తి పన్ను వసూళ్లు మరింత వేగవంతం చేయా లన్నారు. వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలని ఆదే శించారు. ప్రతి గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి చెత్త ట్రాక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి చెత్తను సేకరించాలని సూచించారు. పరిశుభ్రతను మరింత పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డీపీఓ మధన్ మోహన్, డీఆర్‌డీఓ రఘువరన్, ఎంపీడీఓలు, ఎంపీవోలు పాల్గొన్నారు.