Share News

MLA: కోడి పందేలతో నాకు సంబంధం లేదు

ABN , Publish Date - Feb 17 , 2025 | 01:30 AM

ఎమ్మెల్సీ పి.శ్రీనివా్‌సరెడ్డి సమాధానమిచ్చారు. కోడి పందేలతో తనకు సంబంధంలేదని న్యాయవాది ద్వారా సమాధానం పంపినట్లు పోలీసులు తెలిపారు.

MLA: కోడి పందేలతో నాకు  సంబంధం లేదు

ఎమ్మెల్సీ శ్రీనివా్‌సరెడ్డి సమాధానం

మొయినాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంరధజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో జరిగిన కోడిపందేల కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఫాంహౌస్‌ యజమాని, ఎమ్మెల్సీ పి.శ్రీనివా్‌సరెడ్డి సమాధానమిచ్చారు. కోడి పందేలతో తనకు సంబంధంలేదని న్యాయవాది ద్వారా సమాధానం పంపినట్లు పోలీసులు తెలిపారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని రమే్‌షరెడ్డికి 2023లో లీజుకు ఇచ్చినట్టు పేర్కొన్నారు. కోడిపందేల సూత్రధారి, నిర్వాహకుడు శివకుమార్‌వర్మ అలియాస్‌ గబ్బర్‌సింగ్‌ను కస్టడీకి ఇ వ్వాలని పోలీసులు కోర్టు లో పిటిషన్‌ వేయగా.. సోమవారం విచారణకు రానుంది. కాగా, పోలీసు ఆధీనంలో ఉన్న పందెం కోళ్లను కోర్టు అనుమతితో సోమ వారం వేలం వేయనున్నట్లు తెలిసింది.

Updated Date - Feb 17 , 2025 | 01:30 AM