MLA Harish Babu: పోడు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే హరీశ్‌బాబు నిరవధిక నిరాహార దీక్ష
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:10 AM
పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని...
కాగజ్‌నగర్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరు ఎమ్మెల్యే హరీశ్ బాబు సోమవారం కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోడు రైతుల సమస్యలను ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా స్పందించడం లేదని చెప్పారు. జీవో 49ను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించాలన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడేవరకు దీక్షను కొనసాగిస్తానన్నారు. అంతకుముందు ఆయన పోడు రైతుల సమస్య పరిష్కరించాలని కాగజ్‌నగర్ అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం చేపట్టగా.. ఉదయమే పోలీసులు హరీశ్ బాబును హౌస్ అరెస్టు చేశారు.