ధర్నా అంటే ఉలిక్కిపడుతున్న మంత్రులు
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:52 AM
నల్లగొం డలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే రైతు మహాధర్నా అంటేనే మంత్రులు ఉలిక్కి పడు తున్నారని, కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.
నల్లగొండ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): నల్లగొం డలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే రైతు మహాధర్నా అంటేనే మంత్రులు ఉలిక్కి పడు తున్నారని, కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ ధర్నా గురించి చెప్పిన నాటినుంచి అనేక ఆటంకాలను కల్పిస్తున్నారని, జిల్లాకేంద్రంలో మంగళవారం జరిగిన పరిణామాలు కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషకరమని, ఈ నెల 28న నల్లగొండలో జరిగే ఉమ్మడి జిల్లా రైతు మహాధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డుల సభల్లో గొడవలు జరు గుతున్నాయని, ప్రజలకు ఏ మాత్రం నమ్మకం లేదని ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కూలీలకు రూ.12వేలు, రైతుభరోసా, రేషన్ కార్డులు ఇస్తారో లేదోనన్న ఆందోళన ఏర్ప డిందన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. సమా వేశంలో పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోనగిరి దేవేం దర్, కొండూరు సత్యనారాయణ, తుమ్మల లింగ స్వామి, నాగార్జున ఉన్నారు. నల్లగొండలో కేటీఆర్ పాల్గొనే మహాధర్నాకు అనేక ఆటంకాలు కల్పిస్తున్న అధికార పార్టీకి బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిందని బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.