Share News

Uttam Kumar Reddy : ఇంటింటి సర్వేపై అపోహలు సృష్టించవద్దు

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:54 AM

సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సామాజిక ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే నిర్వహించిందన్నారు.

 Uttam Kumar Reddy : ఇంటింటి సర్వేపై అపోహలు సృష్టించవద్దు

విపక్షాలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచన

ఓసీలు తగ్గారు.. బీసీలు పెరిగారని వెల్లడి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సామాజిక ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే నిర్వహించిందన్నారు. మంగళవారం అసెంబ్లీలో సర్వేపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. విపక్షాల ఆరోపణలను ఆయన తిప్పికొడుతూ సర్వేను క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్వహించామని చెప్పారు. అంకెల గారడీతో ఇంటింటి సర్వేపై ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించవద్దని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల శాతం 21 ఉండగా... ఇప్పుడు 15.79 శాతానికి తగ్గిందనితెలిపారు. బీసీల శాతం 51 ఉండగా... తమ సర్వేలో 56 శాతానికి పెరిగిందని చెప్పారు. గణాంకాలు ఇంత స్పష్టంగా ఉండగా విపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లపై అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నామని, ఇక్కడి బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి, రిజర్వేషన్లను ఆమోదింపజేయాలని సూచించారు.

Updated Date - Feb 05 , 2025 | 03:54 AM