Minister Jupally Travels: మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:58 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులతో
హైదరాబాద్, ఆగ స్టు 10 (ఆంధ్రజ్యోతి): మంత్రి జూపల్లి కృష్ణారావు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులతో మాట్లాడి సాధకబాధకాలను తెలుసుకున్నారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ఎల్‌బీ నగర్ నుంచి కేపీహెచ్‌బీ వరకు మంత్రి జూపల్లి మెట్రోలో ప్రయాణించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కూడా మెట్రోలో ప్రయాణించారు.