Share News

Minister Jupally Krishna Rao : తప్పు చేయనప్పుడు కోర్టుకెందుకెళ్లారు?: జూపల్లి

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:31 AM

ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి కేటీఆర్‌ తప్పు చేయనప్పుడు కోర్టుకెందుకెళ్లారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలోని ఆయన

Minister Jupally Krishna Rao : తప్పు చేయనప్పుడు కోర్టుకెందుకెళ్లారు?: జూపల్లి

కేటీఆర్‌.. ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలి: ఎంపీ చామల

బాన్సువాడ/హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి కేటీఆర్‌ తప్పు చేయనప్పుడు కోర్టుకెందుకెళ్లారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలోని ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిందని, ఏసీబీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. తప్పు చేయనప్పుడు ఏసీబీ విచారణకు హాజరై సహకరించాలని ఆయన సూచించారు. కేటీఆర్‌ ఇప్పటికైనా కోర్టులు, చట్టాలను గౌరవించాలని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి హితవు పలికారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తూ నాటకాలు ఆడొద్దన్నారు. హైకోర్టు కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఒక ప్రకటనలో ఆయన సూచించారు.

Updated Date - Jan 08 , 2025 | 05:31 AM