Share News

Chiranjeevi: చిరంజీవి కార్మికులతో మాట్లాడతా అన్నారు: నిర్మాత సి.కల్యాణ్

ABN , Publish Date - Aug 17 , 2025 | 02:14 PM

ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె కారణంగా గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పలు సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. పలు సార్లు తెలుగు సినిమా నిర్మాతలు, కార్మికుల మధ్య చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నట్టు వార్తలు వచ్చాయి.

Chiranjeevi: చిరంజీవి కార్మికులతో మాట్లాడతా అన్నారు: నిర్మాత సి.కల్యాణ్
Megastar Chiranjeevi

హైదరాబాద్: ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె కారణంగా గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పలు సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. పలు సార్లు తెలుగు సినిమా నిర్మాతలు, కార్మికుల మధ్య చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రంగంలోకి దిగుతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తెలుగు సినిమా నిర్మాత సి.కల్యాణ్ (C.Kalyan), పలు ఇతర ప్రముఖులు చిరంజీవిని కలిసి సమస్యను వివరించారు.


'ఈరోజు చిరంజీవి గారిని కలిశాము. ఈ సమస్య సాల్వ్ కావాలని చిరంజీవి మాతో ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు‌. రేపు ఫెడరేషన్ వారు చిరంజీవి గారిని కలవబోతున్నారు. తన వంతుగా కార్మికులతో మాట్లాడాతానని చిరంజీవి హామీనిచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా కృషి చేస్తున్నార'ని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.


తాను ఛాంబర్‌కు కౌన్సిల్ ఫెడరేషన్ దూతగా ఉన్నానని కల్యాణ్ పేర్కొన్నారు. తనకున్న అనుభవంతో ప్రాక్టికల్ సమస్యలను చిరంజీవికి వివరించానని చెప్పారు. చిరంజీవి గారు పెద్ద మనిషిగా, ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారని కల్యాణ్ తెలిపారు. వర్కర్స్‌ను నిర్మాతలు కలిసి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేబర్ కమీషనర్ రికార్డ్ రూల్స్ ప్రకారం సినిమాలకు వర్క్ చేయలేమని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని నమ్ముతున్నానని కల్యాణ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి

మీరు ఇంత ప్రత్యేకమా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..

Updated Date - Aug 17 , 2025 | 02:50 PM