Share News

నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:09 AM

వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఇప్పటి నుంచే తగి న జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అ ధికారి వెంకయ్య అన్నారు.

 నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి
నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న డీపీవో వెంకయ్య

నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి

జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య

కేతేపల్లి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఇప్పటి నుంచే తగి న జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అ ధికారి వెంకయ్య అన్నారు. నార్కట్‌పల్లి గ్రామ పం చాయతీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సిబ్బంది హాజరు, వివిధ రకాల రికార్డులను పరిశీలించారు. స్థానికంగా చేపడుతున్న పారిశుధ్య ప నులు, తాగునీటి సరఫరా తీరును తెలుసుకున్నా రు. సిబ్బందితో మాట్లాడి వివిధ రకాల పనుల వ సూళ్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గ్రామ పంచాయతీలో పన్నుల వసూళ్లు పెరగాలన్నారు. డి మాండ్‌ మేరకు కమర్షియల్‌, రెసిడిన్సియల్‌, ఆస్తి, ఇంటి పన్నుల వసూలుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. పారిశుధ్య పనుల నిర్వహణ, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లలో నిర్ల క్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సుభాన్‌, సిబ్బంది గీతాంజలి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 01:09 AM