Share News

మెను ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:26 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని డీఈవో యాదయ్య పేర్కొ న్నారు. శుక్రవారం మండలంలోని టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల, కుందారం లోని జిల్లా పరిషత్‌ పాఠశాల, శెట్‌పల్లిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

మెను ప్రకారం భోజనం అందించాలి
కుందారంలో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో యాదయ్య

జైపూర్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని డీఈవో యాదయ్య పేర్కొ న్నారు. శుక్రవారం మండలంలోని టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల, కుందారం లోని జిల్లా పరిషత్‌ పాఠశాల, శెట్‌పల్లిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. టేకుమట్ల ప్రాథమిక పాఠశాలలో మ ధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కిచెన్‌ రూం పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. అనంతరం కుందారం, శెట్‌పల్లిలోలోని పాఠశాలలను సందర్శిం చారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యా ర్థులు చదువు విషయంలో అశ్రద్ద చేయవద్దని, చదువుకుంటేనే ఎన్నో ప్ర యోజనాలుంటాయని సూచించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 11:26 PM