Guttedars : రెండోసారీ సిండికేటయ్యారు!
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:43 AM
మార్క్‌ఫెడ్ జొన్నల విక్రయ టెండర్లు రద్దు చేసింది. గుత్తేదారులు తక్కువ ధర కోట్(నమోదు) చేయడంతో టెండర్లు రద్దు చేశారు. 2023-24 యాసంగి సీజన్‌లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు 94 వేల

జొన్నల కొనుగోళ్లలో గుత్తేదారుల తీరు
తక్కువ ధరకు టెండర్లు.. రద్దు చేసిన అధికారులు
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్ జొన్నల విక్రయ టెండర్లు రద్దు చేసింది. గుత్తేదారులు తక్కువ ధర కోట్(నమోదు) చేయడంతో టెండర్లు రద్దు చేశారు. 2023-24 యాసంగి సీజన్‌లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు 94 వేల మెట్రిక్ టన్నుల జొన్నలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. వీటిని వేలంపాట ద్వారా విక్రయించేందుకు మార్క్‌ఫెడ్ టెండర్లు పిలిచింది. తొలిసారి టెండరు నోటిఫికేషన్ విడుదల చేస్తే 15 మంది గుత్తేదారులు పాల్గొన్నారు. క్వింటాలుకు రూ.1,800 చొప్పున కోట్ చేశారు. కాని మార్క్‌ఫెడ్ రైతుల నుంచి క్వింటాలుకు రూ. 3,180 చొప్పున కనీస మద్దతు ధరతో జొన్నలు కొనుగోలు చేసింది. గుత్తేదారులు చాలా తక్కువ ధర కోట్ చేయడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. ఇటీవల రెండోసారి టెండర్లు పిలిచారు. ఈసారి 12 మంది గుత్తేదారులు రెండోసారి కూడా సిండికేట్‌గా ఏర్పడి... క్వింటాలుకు రూ.1,800 చొప్పున బిడ్లు దాఖలు చేశా రు. ఈ టెండర్లను కూడా రద్దు చేసినట్లు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివా్‌సరెడ్డి, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు.