Arrested For Misconduct: తాగిన మత్తులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరంగం.. గృహిణితో అసభ్య ప్రవర్తన
ABN , Publish Date - Oct 29 , 2025 | 08:42 PM
అక్టోబర్ 26వ తేదీన హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న మాదల శ్రీలతతో పాటు మరికొంతమందిని వీడియో తీయటం మొదలెట్టాడు.
గృహిణితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బల్కంపేటకు చెందిన బొమ్మినేని శ్రీవరుణ్ ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో టెక్ సపోర్ట్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నాడు. అక్టోబర్ 26వ తేదీన హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న మాదల శ్రీలతతో పాటు మరికొంతమందిని వీడియో తీయటం మొదలెట్టాడు.

ఇది గమనించిన శ్రీలత భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో శ్రీవరుణ్ ఆయనతో గొడవపెట్టుకున్నాడు. ఈ గొడవ ఆపేందుకు ప్రయత్నించిన శ్రీలతను, ఆమె అత్తను, కుమార్తెను ఉద్దేశిస్తూ శ్రీవరుణ్ అసభ్యకరమైన భాషలో దూషించాడు. బెదిరింపులకు సైతం దిగాడు. ఈ నేపథ్యంలో శ్రీలత అక్టోబర్ 27వ తేదీన ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీవరుణ్‌పై ఫిర్యాదు చేసింది.
ఇన్‌స్పెక్టర్ టి. శ్రీనాథ్ రెడ్డి నిందితుడిపై క్రైమ్ నెంబర్ 831/2025 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును సబ్-ఇన్‌స్పెక్టర్ మధుసూధన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
పెళ్లికి ముందు ఎఫైర్.. బావను మర్డర్ చేసిన యువతి..
రాష్ట్రపతితో రఫేల్ రాణి శివాంగి సింగ్.. పాక్ కట్టుకథలకు మరోసారి చెక్