Share News

Woman Assasinated Brother In Law: పెళ్లికి ముందు ఎఫైర్.. బావను మర్డర్ చేసిన యువతి..

ABN , Publish Date - Oct 29 , 2025 | 08:08 PM

పెళ్లికి ముందు పెట్టుకున్న ఎఫైర్ ఓ యువతిని హంతకురాలిని చేసింది. తనను బెదిరిస్తున్నాడన్న కోపంతో సదరు యువతి తన బావను హత్య చేసింది. సోషల్ మీడియాలో వీడియోలు చూసి మరీ మర్డర్ చేసింది.

Woman Assasinated Brother In Law: పెళ్లికి ముందు ఎఫైర్.. బావను మర్డర్ చేసిన యువతి..
Woman Assasinated Brother In Law

ఓ యువతి సోషల్ మీడియాలో వీడియోలు చూసి బావను మర్డర్ చేసింది. పక్కా ప్లాన్‌తో మర్డర్ చేసినా కేవలం నాలుగు రోజుల్లోనే పోలీసులకు దొరికిపోయింది. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నార్సింగ్‌పూర్ జిల్లాకు చెందిన నిధి సాహు అనే యువతి బావ శ్రీజన్ సాహుతో ఎఫైర్ పెట్టుకుంది.


ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం నిధికి పెళ్లి నిశ్చయం అయింది. ఆ పెళ్లి ఇష్టం లేని శ్రీజన్ ఆమెపై బ్లాక్ మెయిల్‌కు దిగాడు. ఏకాంతంగా ఉన్నపుడు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. నిధి అతడి బెదిరింపులకు తలొగ్గకుండా పెళ్లి చేసుకుంది. దీంతో శ్రీజన్ తన వేధింపులు మరింత పెంచాడు. రోజురోజుకు శ్రీజన్ వేధింపులు పెరగటంతో నిధి తట్టుకోలేకపోయింది.

MP-NEWS.jpg


ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని భావించింది. మర్డర్‌కు ప్లాన్ చేసింది. ఐడియాల కోసం సోషల్ మీడియాలో వీడియోలు చూసింది. సాహిల్ అనే వ్యక్తికి శ్రీజన్‌ను చంపడానికి డీల్ ఇచ్చింది. మర్డర్ చేస్తే 50 వేలు ఇచ్చేట్టుగా ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్ కింద మొదట 10 వేలు ఇచ్చింది. నిధి, సాహిల్, మరో వ్యక్తి కలిసి ఏం చేయాలో ప్లాన్ చేసుకున్నారు.

MP-NEWS-2.jpg


అక్టోబర్ 25వ తేదీన నిధి, శ్రీజన్‌కు ఫోన్ చేసి లాంగ్ డ్రైవ్‌కు వెళదాం రమ్మంది. శ్రీజన్, నిధి, సాహిల్, మరో వ్యక్తి ఒకే కారులో అడవి వైపు వెళ్లారు. మార్గం మధ్యలో నిధి, శ్రీజన్ మెడపై కత్తితో మూడు సార్లు పొడిచింది. శ్రీజన్ అక్కడికక్కడే చనిపోయాడు. ముగ్గురు నిందితులు కలిసి శవాన్ని అడవిలో పూడ్చేశారు. ఒప్పందం ప్రకారం డబ్బులకు బదులు నిధి తన విలువైన బంగారు కమ్మల్ని సాహిల్‌కు ఇచ్చింది.


తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. శ్రీజన్ ఎంతకీ ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీజన్ మొబైల్ ఫోన్ లొకేషన్ ట్రేజ్ చేయగా అడవిలో చూపించింది. అటు వైపు వెళ్లే మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. నిధి, సాహిల్‌ల గురించి తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.


ఇవి కూడా చదవండి

రాష్ట్రపతితో రఫేల్ రాణి శివాంగి సింగ్.. పాక్ కట్టుకథలకు మరోసారి చెక్

కట్టు బొట్టుకు తెలంగాణ ప్రసిద్ధి: శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి

Updated Date - Oct 29 , 2025 | 08:36 PM