రోజూ వాకింగ్ చేయడం అలవాటుగా చేసుకోవాలి
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:56 PM
వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ రోజు వాకింగ్, వ్యాయా మం చేయడం అలవాటుగా చేసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉండవని ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.

అచ్చంపేటటౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ రోజు వాకింగ్, వ్యాయా మం చేయడం అలవాటుగా చేసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉండవని ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సంక్రాంతి పుర స్కరించుకొని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఆదివారం పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడి యంలో మార్నింగ్ వాక్‌లో భాగంగా వాకింగ్ పోటీలు నిర్వహించారు. వయస్సుల వారీగా కేటగిరీలుగా విభజించి వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. వివిధ కేటగిరీలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ రోజు కాసేపు వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ స భ్యులు భగీరనాథ్, రమేష్, నాగేశ్వర్ రావు, చం దునాయక్, నర్సోజి, రాఘవులు, బషీర్, ఖదీర్, జమీర్, శ్రీరాం పాల్గొన్నారు.
ఫ అమ్రాబాద్ : మండల పరిఽధిలోని మొల కమామిడి గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం చదు వుకొని ఉన్నతస్థాయిలో స్థిరపడిన యువకులు, ఉద్యోగులు నడుబిగించడం రాష్ట్రానికే ఆదర్శమ ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం అభివృద్ధి కమిటీ గ్రామ అధ్యక్షుడు బందె ల జనార్దన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చే సిన భారీ బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ గ్రామానికి చెందిన దాతలు రామలింగయ్య కుమారులు బస్టాండ్ నిర్మాణం, నీటి పారుదల శాఖ డీఈ బాలస్వామి ప్రధాన రహదారి ముఖద్వారం ఏర్పాటు, రాజేష్‌రెడ్డి అనే ఎన్‌ఆర్‌ఐ ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ ని ర్మాణం, మల్లేష్ అనే పోలీసు ఉద్యోగి గ్రామం లో వాలీబాల్ కోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. కార్యక్రమంలో విడిసి కమిటీ చైర్మన్ జనార్ధన్, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు డాక్టర్ అనూరాధ, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, ఉమామహేశ్వర పాలకమండలి సభ్యురాలు శోభ ఉన్నారు.