Maheshwar Reddy: కేసీఆర్‌తో సీఎం రేవంత్ ‘డూప్ ఫైట్’: ఏలేటి
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:57 AM
సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌తో ‘డూప్‌ఫైట్’ చేస్తూ ఆయన అరెస్టు కాకుండా కాపాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌తో ‘డూప్‌ఫైట్’ చేస్తూ ఆయన అరెస్టు కాకుండా కాపాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుధ్థి లేదనడానికి క్యాబినెటు మీటింగు నిర్ణయాలే నిదర్శనమని ఆయన ఆరోపించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలకు ఆయన కుటుంబాన్ని వేయి సంవత్సరాలు జైల్లో పెట్టాల్సి ఉంటుందని చెప్పిన రేవంత్ ఒక్కరిని కూడా జైల్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.