Share News

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:38 PM

యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాసాధనకు కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాసరా వు అన్నారు.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

గద్వాలక్రైం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాసాధనకు కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాసరా వు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్ర వ్యాల నివారణ అవగాహన వారోత్సవా ల్లో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ నివారణ పోస్టర్లను వి డుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనారోగ్య సమస్య లు, ఆర్థిక, సామాజిక దుష్పరిణామాలపై జిల్లా పోలీస్‌ శాఖ తరపున నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమం లో డీఎస్పీ మొగులయ్య, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, సీఐలు, గద్వాల, శాంతినగర్‌ సీఐలు శ్రీను, టాటాబాబు, ఆర్‌ఐ వెంకటేశ్‌ ఉన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:38 PM