యువత భావోద్వేగాలను నియంత్రించుకోవాలి
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:57 PM
యువత భావోద్వేగా లను నియంత్రించుకోవాలని పీయూ వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు.
- పీయూ వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్
పాలమూరు యూనివర్సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): యువత భావోద్వేగా లను నియంత్రించుకోవాలని పీయూ వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. బు ధవారం పీయూలోని సెంట్రల్ లైబ్రరీ ఆ డిటోరియంలో ఎన్‌ఎస్‌ఎస్ సెల్, బియాం డ్ యువర్ మైండ్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ‘చాలెంజెస్ ఫేసింగ్ బై ఉమెన్ అండ్ యూత్’ అనే అంశంపై ఒరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లా డుతూ జీవితంలో ఎదురైన ప్రతీ ఛాలెం జ్‌ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవా లన్నారు. యువతకు ప్రస్తుతం విస్తృత అ వకాశాలు ఉన్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్‌పై పట్టు సాధించి ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలిపారు. అనంతరం ముఖ్యవక్త సరోజ గుళ్లపల్లి మాట్లా డుతూ మహిళలు, యువత ఎదుర్కొనే ప లు సవాళ్లను సమర్థ వంతంగా ఎదుర్కోవాల ని తెలిపారు. ఆధునిక కాలంలో మ హిళలు అంతరిక్షయానంలో రాణిస్తున్నార ని, ఆడపిల్లలకు అన్ని అవకాశాలు పు ష్కలంగా ఉన్నాయని అన్నారు. అనంత రం పీయూ రిజిస్ర్టార్ పూస రమేష్‌బాబు మాట్లాడుతూ పీయూలో విద్యతో పాటు ఆటలకు, వివిధ రంగాల్లో ప్రోత్సాహం అందిస్తున్నామని, పీయూలో అధిక సం ఖ్యలో మహిళా విద్యార్థులు ఉండడం శు భసూచికమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినే టర్ డాక్టర్ ప్రవీణ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రవికాంత్, ప్రో గ్రాం ఆఫీసర్లు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.