పార్టీలో యువతకు పెద్దపీట
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:16 PM
కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు.
- డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. కాంగ్రెస్ యవజన విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అవేజ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో యువతకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలని కోరారు. ప్రజలకు దగ్గర కావాలని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి భవ్య, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి శివంత్ రెడ్డిలు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ విభాగాన్ని బలోపేతం చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని శ్రేణులు పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ నుంచి సర్పంచులుగా విజయం సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మహేశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌రెడ్డి, ఇంతియాజ్, ఇమ్రాన్, లక్ష్మణ్ నాయక్, ఫైజాన్, శ్రీకాంత్, లక్ష్మీకాంత్, సయ్యద్ ముస్తాక్ అలీ, సోఫియాన్, ఇర్ఫాన్, ప్రవీణ్, రహీం, శ్రీశైలం యాదవ్, షకీల్, గణేశ్, కృష్ణ, ఆది, భూపతిరెడ్డి, సమీర్ హుస్సేన్, ఇమ్రాన్, శివ, ఆమెర్, కామ్రాన్ తాలిబ్, సిద్ధిఖ్, మాసుమ్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.