యువజనోత్సవాలు విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:39 PM
యువజన ఉత్సవాల్లో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు చెప్పారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు
గద్వాల న్యూటౌన్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): యువజన ఉత్సవాల్లో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు చెప్పారు. ఈనెల 18న గద్వాల బాలభవన్‌లో నిర్వహించనున్న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలకు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని శుక్రవారం ఐడీవోసీలోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత వివిధ కళల్లో దాగి ఉన్న ప్రతిభ పాటవాలను ప్రదర్శించేందుకు ఈ ఉత్సవాలు దోహదపడుతాయన్నారు. జానపద నృత్యం చేసేందుకు, జానపద గీతాలు ఆలపించేందుకు పదిమంది సభ్యులతో కూడిన మహిళలు, పురుషులు వేర్వేరుగా కానీ, బృందంగా పోటీ పడవచ్చని చెప్పారు. కథ రచ న, చిత్రలేఖనం, కవిత్వం, ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనే కళాకారులు ఈనెల 17న రిజిస్ర్టేషన్ చేసుకోవాలని సూచిం చారు. రిజిస్ట్టేషన్ చేసుకున్న యువతీ, యువకులు 18న పోటీలకు హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో డీవైఎస్‌వో కృష్ణయ్య, ఇంటర్ నో డల్ అధికారి హృదయరాజు, అధ్యాపకులు పవన్‌కుమార్, మునిస్వామి, శంకర్ ఉన్నారు.