కృష్ణానదిలో దూకి యువకుడి గల్లంతు
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:34 PM
ఎర్రవల్లి మండల పరిధిలోని బీ చుపల్లి కృష్ణానదిలో యువకుడు దూకి గల్లంతైన సంఘటన గురువారం చో టు చేసుకుంది.
- గాలింపు చేపట్టిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం
ఎర్రవల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఎర్రవల్లి మండల పరిధిలోని బీ చుపల్లి కృష్ణానదిలో యువకుడు దూకి గల్లంతైన సంఘటన గురువారం చో టు చేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ రవి కథనం ప్రకారం... వనపర్తి జిల్లా కా శీంనగర్ గ్రామానికి చెందిన ఎద్దుల వెంకటేష్(35) తన స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై బీచుపల్లి కృష్ణానదికి చేరుకున్నాడు. తాను నదిలో దూకి చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసి బంధువులకు చేరవేశారు. అప్రమత్తమై న కుటుంబ సభ్యులు వనపర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వారి స మాచారం మేరకు ఇటిక్యాల పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు చ ర్యలు చేపట్టినప్పటికీ గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.