Share News

విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:02 PM

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యు వకుడు దుర్మరణం చెందాడు.

 విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం

భూత్పూర్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యు వకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన శక్రవారం భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలో చోటు చే సుకుంది. స్థానికుల కథనం ప్రకా రం వివరాలు ఇలా ఉన్నాయి. మునిసిపాలిటీ పరిధిలోని గో ప్లాపూర్‌ గ్రామానికి చెందిన పా త్లావత్‌ కార్తీక్‌(19) ఇంటి దగ్గర పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడు డిగ్రీ మొదటి సంవత్సరం చుదువుతున్నాడు. గోప్లాపూర్‌ గ్రామానికి చెందిన తు ల్చనాయక్‌, సావిత్రిలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు కార్తీక్‌ చదువుతున్నాడు. అయితే తుల్చనాయక్‌కు ప్ర భుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. ఈ సంద ర్భంగా ఇంటి నిర్మాణం చేపడుతుండగా ఇంటికి నీరు పోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కార్తీక్‌ విద్యుత్‌ షాక్‌కు గురయ్యా డు. తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ను చికిత్స నిమిత్తం అంబు లెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తలిస్తుండగా మార్గమధ్యం లో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు.. ఉన్నత చదు వులు చదువుతున్న తరుణంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకో వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:02 PM