రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:23 PM
జడ్చర్లలో మేస్ర్తీ పనులు ముగించుకుని తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా మార్గం మాధ్యలో ఎదురుగా వస్తున్న బైక్‌ను అదుపు తప్పి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
- నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు
నవాబ్‌పేట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జడ్చర్లలో మేస్ర్తీ పనులు ముగించుకుని తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా మార్గం మాధ్యలో ఎదురుగా వస్తున్న బైక్‌ను అదుపు తప్పి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలోని కాకర్లపాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన దండు స్వామి (26) జడ్చర్లలో తన సొంత పనులు ముగించుకుని గురువారం రాత్రి 7 గంట ల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో మృతి చెందాడు. కాగా, శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు ఉసేనమ్మ, వెంకటయ్య, భార్య లావణ్యలను ఒప్పించి ఎల్‌వీ ప్రసాద్ నేత్రాలయానికి కళ్లను దానం చేశారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మాజీ వైస్ ఎంపీపీ సంతోష్ రెడ్డి, ఉపస ర్పంచ్ అంబేడ్కర్ రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు.
చికిత్స పొందుతూ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి..
కొత్తకోట, (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా కొత్త కోట పట్టణంలో విద్యుత్ కాంట్రాక్ట్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ గాయపడిన యాదగిరి చి కిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మదనాపురం మండల దంతనూర్ గ్రామానికి చెందిన యాదగిరి (45) గత పదేళ్లుగా కానా యపల్లి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ కాంట్రాక్ట్ లైన్‌మన్‌గా పని చేస్తున్నారు. గురువారం ట్రా న్స్‌ఫార్మరు మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతా నికి గురై గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిచారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గాయపడిన మహిళ...
రాజాపూర్, (ఆంధ్రజ్యోతి): మహబుబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామంలోని స్థానిక జాతీయ రహదారి 44పై శుక్రవారం జరి గిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ శివానందం పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఎరుకలి మల్లమ్మ(49) శుక్రవారం ఉదయం గ్రామంలోని సర్వీస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కంటైనర్ వెనుక నుంచి మహిళను ఢీకొనడంతో తీవ్ర రక్త గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్సులో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యహ్నం 2 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కూతురు అలివేల ఫిర్యాదు మేరకు కంటైనర్ డ్రైవరు రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.