చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:32 PM
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించా లని రాష్ట్ర షూటింగ్‌బాల్ అసోసియేషన్ ఉపా ధ్యక్షుడు గోపాలం, బీజేపీ నాయకుడు కొండ య్య అన్నారు.
మక్తల్, డిసెంబర్ 21 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించా లని రాష్ట్ర షూటింగ్‌బాల్ అసోసియేషన్ ఉపా ధ్యక్షుడు గోపాలం, బీజేపీ నాయకుడు కొండ య్య అన్నారు. ఆదివారం పట్టణంలోని సాయి జ్యోతి ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి సీనియ ర్ షూటింగ్‌బాల్ బాలబాలికల ఎంపికలు నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఈ క్రీడల్లో నైపుణ్యత ప్రదర్శించిన వారికి ఈనెల 24నుంచి 26వరకు వరంగల్ జిల్లా చెన్నారంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపి స్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్య ఆంజనేయులు, రమేష్‌కుమార్, మాద్వార్ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఆడెమ్స్, సోమశేఖర్‌గౌడ్, పీఈటీలు ఝాన్సి, వరలక్ష్మి, శ్రీజ, కీర్తి, శ్రీనిధి, సమత పాల్గొన్నారు.